Friday, November 22, 2024

దేశంలో మొట్టమొదటి వాటర్‌ మెట్రో.. కోచిలో పచ్చ జెండా ఊపనున్న ప్రధాని మోడీ

భారతదేశపు మొట్టమొదటి వాటర్‌ మెట్రో ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోడీ కేరళలోని కోచిలో మంగళవారం పచ్చజెండా ఊపనున్నారు. నగరాల్లో మెరుగైన ప్రజారవాణా సౌకర్యాలను అందించడంలో భాగంగా కోచి వాసులకు వాటర్‌ మెట్రో సేవలను అందిస్తుందని అధికారులు తెలిపారు. ఒక వినూత్నమైన అర్బన్‌ మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌గా పేరొందిన వాటర్‌ మెట్రో.. సాధారణ మెట్రో సిస్టమ్‌ తరహా ప్రయాణ అనుభవాన్ని ప్రజలకు అందిస్తుంది. కోచి లాంటి నగరాల్లో వాటర్‌మెట్రో ఎంతో ఉపయోగకరమని అధికారులు చెప్పారు.

మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని సమకూర్చడంలో మూస ధోరణి అవలంభించుకుండా ఒక ఆచరణాత్మకమైన విధానాన్ని మోడీ ప్రభుత్వం చేపట్టిందని అధికారులు తెలిపారు. కోచిలో ప్రారంభం కానున్న వాటర్‌ మెట్రో… దేశంలో మెట్రో కనెక్టివిటీ విస్తరణలో ఈ విధమైన వైఖరికి తార్కాణంగా నిలిచిందని చెప్పారు. ఇలాంటి మెట్రో సిస్టమ్‌ కారణంగా టయిర్‌2 నగరాలు, చిన్న నగరాల్లో తక్కువ ఛార్జీలతో ప్రజలు ప్రయాణించగలరు. అలాగే కీలకమైన వాహనాల రాకపోకల రద్దీ సమయాల్లో దాదాపు 15,000 మంది ప్రజలకు ప్రయాణంలో ఇక్కట్లను నివారించవచ్చని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement