Monday, December 2, 2024

MODI | పార్లమెంట్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్’.. కేంద్రమంత్రులతో కలిసి వీక్షించిన ప్రధాని

గుజరాత్ అల్లర్లు, గోద్రా రైలు దహనకాండ ఘటనల ఆధారంగా తెరకెక్కిన “ది సబర్మతి రిపోర్ట్” సినిమాని నేడు (సోమవారం) సాయంత్రం బాలయోగి ఆడిటోరియంలో ప్రదర్శించారు. కాగా, పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శించిన ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఆయనతో కలిసి సినిమాను వీక్షించారు.

ఇటీవల ఈ సినిమా విడుదల కాగా.. ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు ప్రధాని మోదీ స్పందించారు. ‘కల్పిత కథనాలు పరిమితకాలమే కొనసాగుతాయి… సామాన్యులకు కూడా అర్ధమయ్యేరీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సినిమాను ఇప్పుడు పార్లమెంటులో షో వేయడం గమనార్హం.

కాగా, 2002లో గుజరాత్లో గోద్రా రైలు దహనకాండ ఘటనలో 59 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను తెరకెక్కించారు. విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటించగా.. రిధి డోగ్రా మరో కీలక పాత్ర పోషించారు. నవంబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు పార్లమెంటులోనూ ప్రదర్శించనుండటం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement