న్యూఢిల్లీ – భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీంరావు అంబేద్కర్ 67వ వర్ధంతి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. పూజ్యమైన బాబా సాహెబ్ అంబేద్కర్ జీ తన జీవితాన్ని అణగారిన వర్గాల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా సామాజిక సామరస్యానికి కృషి వ్యక్తి అని కోనియాడారు. దళిత కుటుంబం నుంచి వచ్చి.. అణగారిన వర్గాల ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడంతో భారత రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా అంబేద్కర్ నిలిచారు అంటూ ప్రశంసించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement