క్వాడ్ దేశాల శిఖరాగ్ర భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాల సాయంత్రం జపాన్ బయల్దేరి వెళ్లారు. టోక్యోలో మే 24న క్వాడ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లు, అవకాశాలపై చర్చించనున్నారు. అంతేకాకుండా, కరోనా అనంతర పరిస్థితులు, ఆరోగ్య భద్రత, సుస్థిర మౌలిక సదుపాయాలు, వస్తు సరఫరా వ్యవస్థలు తదితర అంశాలపైనా చర్చించనున్నారు. కాగా, ప్రధాని మోదీ దాదాపు 40 గంటల పాటు జపాన్ గడ్డపై గడపనున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ నేరుగా సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ భేటీలో ఉక్రెయిన్ పైనా చర్చిస్తారని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement