విశాఖపట్నం – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఏపీలోని విశాఖపట్నం జిల్లాకి వస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన విశాఖ రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపన చెయ్యబోతున్నారు..అలాగే సాయంత్రం ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు.
ప్రధాని మోదీ ఏమేం చేస్తారు..
విశాఖపట్నం రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీ నగర్ రైల్వే లైన్ డబ్లింగ్, గుత్తి-పెండేకళ్లు రైల్వే లైన్ డబ్లింగ్ వంటి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇంకా 16వ నంబర్ హైవేలో చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ రోడ్డును జాతికి అంకితం చేస్తారు. ఇంకా నేషనల్ హైవేలు, రైల్వే లైన్లను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
.టూర్ షెడ్యూల్ ఇదే:
* సాయంత్రం 4.15కి ప్రధాని మోదీ.. ప్రత్యేక విమానంలో విశాఖకు వస్తారు.* 4.45 నుంచి 5.30 వరకూ రోడ్ షో ఉంటుంది.* 5.30 నుంచి 6.45 వరకూ ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభ నుంచే వర్చువల్‌గా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ చేస్తారు. తర్వాత ఆయన ప్రసంగం ఉంటుంది.* 6.50కి అక్కడి నుంచి బయలుదేరి, విశాఖ ఎయిర్‌పోర్టుకి వెళ్తారు.* రాత్రి 7.15కి విశాఖ నుంచి విమానంలో… ఒడిశా లోని భువనేశ్వర్‌కి వెళ్తారు.
.రోడ్ షో
ముందుగా ప్రధాని మోడీ విశాఖలోని వెంకటాద్రి వంటిల్లు రెస్టారెంట్ ప్రాంతం నుంచి.. దాదాపు కిలోమీటర్ రోడ్ షో ఉంటుంది. అలా రోడ్ షో చేస్తూ.. సభ జరిగే మైదానానికి వస్తారు. రోడ్ షోకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అద్భుతంగా చేస్తామని అంటున్నారు.