Tuesday, November 26, 2024

మూడు దేశాల పర్యటనకు బయలదేరిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూ ఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారంనాడు మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జపాన్, అస్ట్రేలియా , పాపువా న్యూగునియా దేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని. ఆరు రోజూల పాటు మోడీ పర్యటన కొనసాగుతుంది. జీ-7 సమ్మిట్ లో పాల్గొనేందుకు తాను జపాన్ కు బయలుదేరినట్టుగా మోడీ పేర్కొన్నారు. జపాన్ ఆహ్వానం మేరకు హిరోషిమాకు మోడీ ఇవాళ వెళ్లారు.

జపాన్ ప్రధానమంత్రి కిషిదా ఇటీవల ఇండియా టూర్ కు వచ్చారు. కిషిదా ఇండియా టూర్ నుండి తిరిగి జపాన్ కు వెళ్లిన తర్వాత ఆయనను మళ్లీ కలుసుకొనేందుకు వెళ్లడం ఆనందంగా ఉందని మోడీ పేర్కొన్నారు.

ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఏం చేయాలనే దానిపై జీ 7 సమ్మిట్ లో చర్చలు జరగనున్నాయి.ఈ సమావేశాలకు హాజరైన భాగస్వామ్య ప్రతినిధులతో అభిప్రాయాలను పంచుకోవడం కోసం తాను ఎదురుచూస్తున్నట్టుగా ప్రధాని పేర్కొన్నారు. జపాన్ లోని హిరోషిమాలో జరిగే జీ 7 సమ్మిట్ లో పాల్గొనే ఆయా దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించనున్నట్టుగా మోడీ తెలిపారు.

జపాన్ నుండి మోడీ పాపువా న్యూ గినియాలో పోర్ట్ మోర్సీని సందర్శిస్తారు. ఇంతవరకు భారత్ ప్రధాని ఎవరూ కూడా న్యూగినియా ను సందర్శించలేదు. న్యూగినియా ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీయే కానున్నారు.న్యూగినియా ప్రధానితో కలిసి ఈ నెల 22న ఫోరమ్ ఫర్ ఇండియా ఫసిఫిక్ ఐలాండ్ కో ఆపరేటివ్ 3వ, సమ్మిట్ ను మోడీ ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ లో 14 ఫసిఫిక్ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ది , సామర్ధ్యం పెంపుదల, శిక్షణ, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్ధిక అభివృద్ది వంటి అంశాలపై చర్చించనున్నారు.

- Advertisement -

ఆ తర్వాత ప్రధాని మోడీ అస్ట్రేలియా టూర్ కు వెళ్లనున్నారు. అస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశ పర్యటనకు వెళ్తారు. ఇండియా, అస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్టుగా మోడీ పేర్కొన్నారు. అస్ట్రేలియాకు చెందిన పలు కంపెనీల సీఈఓలు, నాయకులతో పాు ఎన్ఆర్ఐలతో చర్చించనున్నట్టుగా మోడీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement