Wednesday, November 20, 2024

Lok Sabha – 18వ లోక్ స‌భ స‌మావేశాలు ప్రారంభం – ముందుగా ప్ర‌ధాని మోదీ ప్ర‌మాణం…

తొలి రోజు స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం
ప్రొటెం స్పీక‌ర్ గా భర్తృహరి మహతాబ్
ముందుగా స‌భ నాయ‌కుడు, ప్ర‌ధాని మోదీ ప్ర‌మాణం
అనంత‌రం కేంద్ర మంత్రుల ప్ర‌మాణ కార్య‌క్ర‌మం
తొలి రోజు 280 మంది ప్ర‌మాణం
తెలుగులో ఓత్ చ‌దివిన కిష‌న్ రెడ్డి, రామ్మోహ‌న్

న్యూఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు ప్ర‌మాణం చేశారు.. ఈక్రమంలో తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎపికి చెందిన మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు.

- Advertisement -

కాగా తొలిరోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయ‌గా, . మిగిలిన వారు మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక రేపు స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నెల 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభమవుతుంది. అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement