పోర్ట్ బ్లెయిర్ – దేశంలోని బడా కుంభకోణాలకు పాల్పడిన పార్టీలన్నీ మరో కుంభకోణం కోసం జతకడుతున్నాయంటూ ప్రధాని మోడీ విపక్షాల కూటమిపై ఫైర్ అయ్యారు.. వారి లక్ష్యం మరో 20 లక్షల కోట్లు దోచుకోవడమేనంటూ ఆరోపించారు.. భారత దేశ అభివృద్ధిని అడ్డుకోవడమే విపకాక్ష మినిమమ్ కామన్ ప్రోగ్రామ్ అని విమర్శించారు . మంగళవారం పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడుతూ, అవినీతిని అడ్డుకునే చర్యలకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు తమ కార్యకర్తలను గాలికి వదిలేసి టీఎంసీతో జత కట్టాయనన్నారు. కుటుంబ పార్టీలు యువత కోసం ఏనాడు ఆలోచించలేదన్న మోడీ.. తమ కుటుంబ పాలనను కాపాడుకోవడమే ఆ పార్టీల లక్ష్యమన్నారు. . ఇదిలా ఉంటే విపక్ష కూటమిని అత్యంత అవినీతిమయైన కూటమిగా ప్రజలు భావిస్తున్నారన్ని మోడీ తెలిపారు. కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి బెయిల్‌పై ఉన్నవారికి కూటమిలో గౌరవం లభిస్తుందని మోదీ ఎద్దేవ చేశారు. ఒక వర్గాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన వారికి కూడా ఆ కూటమిలో ప్రాధాన్యత ఇస్తారని మోడీ విమర్శించారు. యూపీఏ చేసిన తప్పులను తాము సరిదిద్దామమన్న మోడీ 2024లో ప్రజలు మరోసారి బీజేపీనే గెలిపించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.