ఇవాళ్టి నుంచి గుజరాత్‌లో వైబ్రంట్ గుజరాత్ సదస్సు ప్రారంభం కానుంది. మూడురోజుల పాటు సాగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, ప్రముఖ కంపెనీల సీఈఓలు పాల్గొననున్నారు.
కాగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, తూర్పు తిమోర్ అధ్యక్షుడు జోస్ రమోస్-హోరా్ట, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ నుయిసీలతో ఆయన వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆయా దేశాలతో సంబంధాలపై చర్చించారు. అంతకుముందు యూఏఈ అధ్యక్షునికి విమానాశ్రయంలో మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి సదస్సు ప్రాంగణం దాకా మోదీ రోడ్ షో జరిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, పరిశ్రమ వర్గాల ప్రతినిధులతోనూ మోదీ భేటీ అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల గురించి వివరించారు.