Saturday, November 23, 2024

మహిళలు, దళితులు మంత్రులవడం కొంతమందికి నచ్చడం లేదు: ప్రధాని మోదీ..

లోక్‌స‌భ‌ సమవేశాల్లో ప్రతిపక్షాల తీరుపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. కెబినెట్ లోకి కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వారిని సభకు పరిచయం చేసే సమయంలో ప్రతిపక్షాలు సంతోషంగా లేరని ఆయన అన్నారు. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన మ‌హిళా, ద‌ళిత ఎంపీల‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని, ఎంపీల‌ను పరిచ‌యం చేయాల‌నుకున్నాని, కానీ కొంద‌రికి మాత్రం ద‌ళిత ఎంపీలు మంత్రులు కావ‌డం న‌చ్చ‌డం లేద‌ని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్య‌వ‌సాయ‌, గ్రామీణ నేప‌థ్యం ఉన్న‌వారు మంత్రులు అయిన‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. మంత్రిమండ‌లిలో ఓబీసీ వ‌ర్గం కూడా ఉంద‌న్నారు. ప్ర‌ధాని మోదీ త‌న మంత్రిమండ‌లి ప్ర‌వేశ‌పెడుతున్న స‌మ‌యంలో విప‌క్షాలు అడ్డుకోవ‌డాన్ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త‌ప్పుప‌ట్టారు. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న మ‌ధ్య లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వర‌కు వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి: రైతులకు ప్రతినెలా రూ.వెయ్యి సాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement