Friday, October 18, 2024

Modi : అటల్‌ సేతుపై రష్మిక పోస్ట్‌… స్పందించిన మోదీ

భారత్‌లో సముద్రంపై నిర్మించిన అత్యంత పొడవైన వంతెన ‘అటల్ సేతు’పై ప్రముఖ సినీనటి రష్మిక ఇటీవ‌ల ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఓ వీడియోను చిత్రీక‌రించారు. అటల్‌ సేతును కారులో నుంచి వీక్షిస్తూ.. దాని గురించి మాట్లాడుతున్న వీడియోను ఆమె తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

- Advertisement -

ఈ వీడియోలో రష్మిక మందన్న అటల్ సేతు వంతెనను పొగుడుతూ కనిపించింది. ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టేదని.. ఇప్పుడు వారు కేవలం 20 నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చని వివరించింది.

బ్రిడ్జి విశేషాలను వివరిస్తూ.. సముద్రంపై 22 కిలోమీటర్ల పొడవున నిర్మించిన అతి పొడవైన వంతెన ఇదేనని చెప్పింది. ‘ఎవరూ దాని గురించి ఆలోచించలేదు. ఇంజినీరింగ్‌లో ఇదో అద్భుతం. అద్భుతమైన మౌలిక సదుపాయాలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది.” అచి వీడియోలో చెప్పారు. ఈ వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఆమె “దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు… పశ్చిమ భారతదేశం నుంచి తూర్పు భారతదేశం వరకు… ప్రజలను కలుపుతోంది. హృదయాలను కలుపుతోంది!” అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. రష్మిక పోస్ట్‌ను తన “ఎక్స్” ఖాతాలో పంచుకున్నారు. “ఖచ్చితంగా!” అని రాశారు. “ప్రజలను కనెక్ట్ చేయడం, జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు.” అని రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement