అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం ఈ మహాఘట్టం ఆవిష్కృతంకానుంది. అయోధ్య నగరమంతా ఆధ్యాత్మిక రంగులతో అలంకరించబడి. ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం సిద్ధంగా ఉంది. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్నారు.
ఇందుకోసం ఆయన సోమవారం ఉదయం అయోధ్య నగారనికి చేరుకుంటారు. మధ్యాహ్నాం గర్భాలయంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులతో మాట్లాడుతారు. మందిర నిర్మాణంలో పాల్గొన్న శ్రామికులతో ఇష్టాగోష్ఠి నిర్వహించనున్న మోదీ. అక్కడే శివాలయంలో పూజలు చేస్తారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈ వేడుకకి ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రధాన రాజకీయ నేతలు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు, సాధువులు, ఇతరు ప్రముఖులు హాజరుకానున్నారు.