Friday, November 22, 2024

National : ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వేళ….దేశ‌ ప్ర‌జ‌ల‌కు మోదీ బ‌హిరంగ లేఖ‌

ఇవాళ‌ మధ్యాహ్నం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ నేప‌థ్యంలో ప్రధాని మోదీ దేశప్రజలకు లేఖ రాశారు. ప్రధాని మోదీ తన లేఖలో పలు అంశాలను ప్రస్తాంచారు.

“మీ మరియు మా కలయిక ఇప్పుడు ఒక దశాబ్దం పూర్తి చేసుకోబోతోంది.. నా 140 కోట్ల మంది కుటుంబ సభ్యులతో నాకున్న నమ్మకం, మద్దతుతో కూడిన ఈ దృఢమైన సంబంధం నాకు ఎంత ప్రత్యేకమైనదో మాటల్లో చెప్పడం కష్టం అని చెప్పుకొచ్చారు. నా తల్లులు, సోదరీమణులకు సహాయం అందించడానికి మా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది.. ఇది సామాన్య ప్రజల నమ్మకం, విశ్వాసం వల్లనే జరిగిందని ప్రధాని అన్నారు.

ఇక, ప్రధాని మోడీ తన లేఖలో పలు అంశాలను ప్రస్తాంచారు..

- Advertisement -
  1. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా శాశ్వత గృహాలు
  2. అందరికీ విద్యుత్, నీరు, గ్యాస్ సరైన ఏర్పాటు
  3. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా చికిత్స ఏర్పాటు
  4. రైతులకు ఆర్థిక సహాయం
  5. మాతృ వందన యోజన ద్వారా మహిళలకు సహాయం

దీంతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి దేశం ముందుకు సాగుతున్న సంకల్పాన్ని నెరవేర్చడానికి నాకు మీ ఆలోచనలు, సూచనలు, మద్దతు అవసరమని ప్రధాని మోడీ అన్నారు. మీ ఆశీర్వాదాలతో మేము అందుకుంటామని నేను విశ్వసిస్తున్నారు.. దేశ నిర్మాణం కోసం మన ప్రయత్నాలు అలసిపోకుండా.. ఆగిపోకుండా కొనసాగుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement