Friday, November 22, 2024

సివిల్ స‌ర్వేట్లు ప్ర‌గ‌తికి మెట్లు…న‌రేంద్ర‌మోడి

న్యూఢిల్లి: ప్రపంచంలో డిజిటల్‌ చెల్లింపుల విషయం లో భారత్‌ అగ్రస్థానంలో ఉందని, దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతున్నదని ఆయన అన్నారు. చవకగా మొబైల్‌ డాటాను ప్రజలకు అందించే దేశాల్లో ఒకటిగా భారత్‌ నిలిచిందని తెలిపారు. విజ్ఞాన్‌ భవన్‌లో 16వ సివిల్‌ సర్వీసెస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని సివిల్‌ సర్వెంట్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ”నేడు భారత్‌లో ప్రతి ఒక్క సివిల్‌ సర్వీస్‌ అధికారి ఎంతో అదృష్టం చేసు కున్నారు. ఈ సమయంలో దేశానికి సేవ చేసే అవకాశం మీకు దక్కింది. మనకు సమ యం తక్కువగా ఉన్నప్పటికీ మనకు అనం తమైన సామర్థ్యం ఉన్నది. మన లక్ష్యాలు క్లిష్టతరమైనవి కావొచ్చు కానీ మనకు ఉన్న తెగువ ఘనమైనది. మనం పర్వత శిఖ రాన్ని చేరుకోవాల్సి ఉంది కానీ మన ఉద్దేశ్యాలు ఆకాశం కన్నా ఉన్న తమైనవి” అని ప్రధాని అన్నారు. మన పథకాలు ఎంత గొప్పవైనప్పటికీ, కాగితాలపై అవి ఎంత మంచిగా కనిపించినప్పటికీ, అవి చివరి లబ్దిదారు వరకు చేరడమే ఒక నిర్ణయా త్మకమైన అంశంగా ఉంటుందని తెలిపారు. ”అతి పెద్ద అడుగు వేసే దిశగా సివిల్‌ సర్వెం ట్లు దేశాన్ని సన్నాహ పరుస్తున్నారు. సత్‌ పరిపాలనకు లభిస్తుందనే ఒక ఆశను వారు పేద ప్రజల్లో కలిగించారు. దేశంలో అభివృద్ధిని వేగవంతం చేశారు” అని ప్రధాని మోడీ అన్నారు.

సివిల్‌ సర్వెంట్ల చొరవతో గత తొమ్మిది సంవత్సరాల కాలంలో సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ”గత తొమ్మిది సంవత్స రాల్లో దేశంలో నిరుపేదలు సత్‌ పరిపాలన పట్ల విశ్వా సాన్ని పొందారంటే దాని వెనుక మీరు పడిన కష్టం ఉంది. మీరు భాగస్వామ్యంతోనే గత తొమ్మిది సంవత్సరాల్లో భారత్‌లో అభివృద్ధి జోరందుకుంది. కోవిడ్‌ సంక్షోభా న్ని చవిచూసినప్పటికీ ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిం చింది” అని ఆయన చెప్పారు. ”తొలి ప్రాధాన్యత దేశా నికి.. తొలి ప్రాధాన్యత పౌరులకు” అంటూ మనం చేస్తున్న మంత్ర పఠనం ఇ కపై కూడా కొనసా గుతుందని ప్రధాని తెలిపారు. ప్రతి ఒక్కరి సమయం, వనరులను సమర్థమంతంగా వినియోగించుకోవడం ద్వారా అందరికీ సేవ చేయా లనే ఒక దృక్కోణంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన విధా నాలు, వారసత్వ రాజకీ యాలు ఒక అవినీతికరమైన వాతావరణానికి దారి తీశాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేపట్టిన విధా నాలకు సంబంధించిన కొన్ని ఉదాహ రణలను ప్రధాని ప్రస్తావించారు. ఆ విధానాల పుణ్యామాని నాలుగు కోట్లకు పైగా నకిలీ వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని, నాలు గు కోట్లకు పైగా నకిలీ రేషన్‌ కార్డులు మంజూ రయ్యాయని, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా కాగితం మీద మాత్రమే కనిపించే కోటి మంది మహి ళలు, పిల్లలకు ప్రయోజనాలు అందా యని మోడీ ఆరోపించారు. ఆఖరికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా దాదా పు 30 లక్షల మంది యువతకు నకిలీ ఉప కారవేతనాలు అందాయని ఆయన అన్నా రు. మహాత్మా గాంధీ జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీ ఎన్‌ఆర్‌యీజీఏ) కింద అసలు ఉనికిలో లేని కార్మి కులకు ప్రయోజనాలు బదలీ చేయడం కోసం లక్షలా దిగా నకిలీ ఖాతాలు సృష్టించారని ప్రధాని నిం దిం చారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను అనర్హులకు దక్కకుండా కాపాడ్డంలో చురుకైన పాత్ర పోషించారంటూ వారిని అభినందించారు. అలా ఆదా చేసిన అంత పెద్ద మొత్తాన్ని ప్రస్తుతం పేదల సంక్షేమం కోసం వినియోగిస్తున్నట్టు తెలిపారు. ”ఒక అభివృద్ధి చెందిన భారత్‌ కోసం సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ వ్యవస్థ అండగా ఉండాలి. మొదట్లో ప్రభుత్వం ప్రతీదీ చేస్తుందనే ఆలోచనా ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నదనే ఆలోచనా ధోరణి ఏర్పడింది” అని అధికారస్వామ్య వైఖరిలో వచ్చిన మార్పును ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ”ఒక రాజకీయ పార్టీ పన్ను చెల్లింపుదారుల ద్వారా వచ్చిన సొమ్మును తన పార్టీ ప్రయోజనం కోసం వాడుకుంటున్నదా? లేక దేశం కోసం వినియోగిస్తున్నదా? అని అధ్యయనం చేయాల్సిన బాధ్యత అధికారస్వామ్యం(బ్యూరోక్రసీ) పై ఉంది” అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement