ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసానికి వెళ్లి ఆమె సమావేశమయ్యారు. భేటీ సందర్భంగా పలు విషయాలపై వారు చర్చించుకున్నారు. కాసేపటి క్రితం ప్రధాని నివాసం నుంచి ఆమె వెళ్లిపోయారు. భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆమె ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి. ఢిల్లీలో ఐదు రోజుల పాటు ఆమె పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో రేపు మమత భేటీ కానున్నారు. టీఎంసీ ఎంపీలతో కూడా రేపు ఆమె సమావేశం కానున్నారు.
ఇది కూడా చదవండి : షర్మిల దీక్షకు కోమటిరెడ్డి మద్దతు!