Sunday, November 24, 2024

Russia:మోడీ జీ ప్లీజ్ క‌మ్‌… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం..

ఉక్రెయిన్‌ సంక్షోభం ముగించేందుకు ముందుకు రావాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆహ్వానం అందించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో క్రెమ్లిన్‌లో జైశంకర్‌ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌ సంక్షోభం సహా పలు అంశాలపై వీళ్లు చర్చించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీని రష్యా పర్యటనకు పుతిన్‌ ఆహ్వానించారు. ఉక్రెయిన్‌ సంక్షోభం శాంతియుతంగా పరిష్కృతమవ్వాలని మోదీ కోరుకుంటున్న సంగతి తనకు తెలుసని పుతిన్ పేర్కొన్నారు. దాని గురించి తామిద్దరం చాలాసార్లు మాట్లాడుకున్నామని, ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితిపై భారత్‌కు మరింత అదనపు సమాచారం అందజేస్తామని వెల్లడించారు. భారత్‌తో తమ దేశ వాణిజ్య లావాదేవీల్లో వరుసగా రెండో ఏడాది గణనీయ పెరుగుదల నమోదవుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధానంగా ముడి చమురు, అత్యాధునిక సాంకేతిక రంగాలు ఈ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పుతిన్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement