Friday, November 22, 2024

తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ స‌ర్కారు య‌త్నం : మంత్రి కేటీఆర్‌

తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం య‌త్నిస్తోంద‌ని, వీటికి రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన భూముల‌ విలువ సుమారు రూ. 40వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు. ఈ ఆరు సంస్థ‌ల‌కు గతంలో సూమారు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం రూ.5 వేల కోట్లకు పైగా ఈ భూముల విలువ ఉంటుంద‌ని, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 40వేల కోట్లు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్ద‌ని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ లేఖ రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement