ఇటలీలో జరుగుతున్న జీ 7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిజీబిజీగా ఉన్నారు. ఆయన వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. మోడీని కలిసేందుకు, ఆయనతో సమావేశమయ్యేందుకు జీ7 దేశాల అధినేతలు ఉత్సాహం చూపించారు. మోడీ కేంద్రంగా జీ7 సదస్సు జరిగినట్లుగా కనిపించింది. ఈ సదస్సుకు మోడీ సెంటర్ ఆఫ్ అట్రక్షన్గా నిలిచారు. బ్రిటన్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఇటలీ దేశ ప్రధాని.. ఇలా అందరూ మోడీతో చర్చలు జరపడానికి ప్రాధాన్యతనిచ్చారు. మోడీతో ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
- Advertisement -