Sunday, September 8, 2024

Global Leader | మ‌ళ్లీ మోదీనే గ్లోబల్ లీడర్..

భారత ప్రధాని మోదీ మరోసారి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ ఆఫ్ అమెరికా నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ 69 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరం, జూలై 8-14 మధ్య, మార్నింగ్ కన్సల్ట్ సర్వే సంస్థ ప్రతి దేశంలోని ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ జాబితాను విడుదల చేసింది.

కాగా, ఈ జాబితాలో మొత్తం 25 మంది నేతలు షార్ట్ లిస్ట్ కాగా… మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రడార్ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. జపాన్ ప్రధాని పుమియో కిషిడా ఈ జాబితాలో అట్టడుగు స్థానంలో ఉన్నారు. అలాగే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బిడెన్‌కు 39 శాతం ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement