గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటన పై ప్రధాని మోడీ ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు.
పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.