Wednesday, November 20, 2024

మూడురోజులపాటు మోస్తరు వర్షాలు.. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రాగల మూడురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది. ఈ నెల 13 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు పసుపు హెచ్చరికలను జారీ చేసింది.

సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంబీం ఆసీఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది.

- Advertisement -

సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయని, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు మూడు రోజులపాటు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. కాగా… ఆదివారం నిజామాబాద్‌ , రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్‌, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌, ములుగు, హన్మకొండ, వరంగల్‌, జనగామ, సిద్ధిపేట, సంగారెడ్డి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement