మోచా తుఫాను మయన్మార్ లో బీభత్సం సృష్టించింది.. తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 145కు చేరుకుందని అధికార జుంటా సమాచార బృందం ఒక ప్రకటనలో తెలిపింది అక్కడ కనీసం 8 లక్షల మందికి అత్యవసర ఆహార సహాయం, ఇతర సహాయం అవసరమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.. తుఫాన్ వల్ల 8 లక్షల మందికి పైగా తీవ్రంగా ప్రభావితమయ్యారని ఐరాస వెల్లడించింది. కాగా, తుఫాను మయన్మార్ లోని రఖైన్ రాష్ట్ర వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిందనీ, అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయని, చెట్లు నేలకూలడంతో రోడ్లు తెగిపోయాయని, ఆస్పత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయి. టెలికమ్యూనికేషన్లు, విద్యుత్ లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయయి..
ఇది ఇలాఉంటే మోచా తుఫాను ప్రభావిత మయన్మార్ ప్రజలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం “ఆపరేషన్ కరుణ” ను ప్రారంభించింది. సహాయ సామగ్రితో మూడు నౌకలు ఇప్పటికే యాంగూన్ చేరుకున్నాయి. మోచా తుఫాను ప్రభావానికి గురైన మయన్మార్ ప్రజలకు భారత్ స్నేహహస్తం అందిస్తోందని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ కరుణలో భాగంగా సహాయక సామాగ్రితో కూడిన మూడు భారత నావికాదళ నౌకలు యాంగూన్ చేరుకున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే బాధితులను ఆదుకుంటున్నామని తెలిపారు.. ఆహారం, మందులు . అత్యవసర సామాగ్రిని ప్రజలకు అందజేస్తున్నామని వెల్లడించారు.