కరోనా మహమ్మారి దేశంలో అడుగుపెట్టి ఏడాదికి పైనే అవుతుంది. అయితే లాక్ డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు నిలుపివేశారు. ఇప్పుడు 2021 మార్చి 16 వచ్చింది. అంటే ఎంఎంటీఎస్ సర్వీసులు నిలిపివేసి నేటికి సరిగ్గా ఏడాది అవుతుంది. కాగా జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు, రోజూ ఆఫీసులకు వెళ్లే వాళ్లకు ఎంఎంటీఎస్ రైళ్లు ఎంతగానో అప్పుడు ఉపయోగపడేవి.
కేవలం రూ.15 టిక్కెట్ తో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌకర్యం ఉండేది. ట్రాఫిక్ కష్టాలు లేకుంఫా లేకుండా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకునే వారు. అనేక మంది ఐటీ ఎంప్లాయీస్, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు కూడాఎంఎంటీఎస్ రైళ్లనే ఎంచుకునేవారు. అయితే నగరంలో మెట్రో రైళ్లకు అనుమతి లభించినా ఇంకా ఎంఎంటీఎస్ కు మాత్రం పర్మిషన్ రాలేదు. ముంబై వంటి నగరాల్లో లోకల్ ట్రైన్స్ నడుస్తున్నా హైదరాబాద్ లో మాత్రం ఇంకా నడవట్లేదు.