ములుగు : వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత కోటగుళ్లలో గోశాల నిర్వహణకు రూ.30 వేలు ఆలయ నిర్వహకులకు అందజేశారు. వీరి వెంట భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఆ పార్టీ నేతలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు వి ప్రకాష్, నాగుర్ల వెంకటేశ్వర్లు, వాసుదేవరెడ్డి, ములుగు జెడ్పీ చైర్ పర్సన్ జగదీశ్వర్ తదితరులు ఉన్నారు. అంతకుముందు ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ ఆలయం వద్ద అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. రామప్ప వద్ద ప్రెస్ మీట్ అనంతరం ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు భూపాలపల్లి బయలుదేరారు.
గణపేశ్వరాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం (కోటగుళ్లు) లో ఆదివారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారివెంట మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి జడ్పీ చైర్ పర్సన్ లు గండ్ర జ్యోతి రెడ్డి జక్కు శ్రీహర్షిని జాగృతి రాష్ట్ర అధ్యక్షులు విజయ్, జిల్లా అధ్యక్షురాలు వాంకుడోత్ జ్యోతి, సూర్యదేవర కార్తీక్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి, ఎమ్మెల్సీ
ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో మార్గ మధ్యలో ఉన్న గట్టమ్మ తల్లిని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.