హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఈ నెల 28న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. మధ్యప్రదేశ్ పర్యటన సందర్భంగా ఓబీసీ ఫ్రంట్ చేపట్టబోయే ”పీడిత్ అధికార్ యాత్ర”ను ఆమె ప్రారంభించనున్నారు. మధ్య ప్రదేశ్లోని ఓబీసీ హక్కల కోసం ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ప్రముఖ బీసీ నేత దామోదర్సింగ్ యాదవ్ ”పీడిత్ అధికార్ యాత్ర”ను నిర్వహిస్తున్నారు.
ఈ యాత్రను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించనున్నారు. ఓబీసీ హక్కల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్కు మద్ధతుగా యాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కలు, డిమాండ్ల సాధన కోసం మధ్యప్రదేశ్ నుండి కేంద్రంలో దామోదర్సింగ్ యాదవ్ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.