Friday, November 22, 2024

MLC Elections – విశాఖ స్థానిక బ‌రిలో బొత్స‌ …

30న ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక‌
ఇప్ప‌టికే షెడ్యూల్ విడుద‌ల
13 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్మ్ – అమ‌రావ‌తి – విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో దిగనున్నారు. ఈ మేర‌కు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ గస్ట్ 30నఈ ఎమ్మె్ల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 841 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఓట్లు, 11 ఖాళీలున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఆగస్ట్ 13 వరకూ స్వీకరించనున్నారు.

కాగా, తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మెజారిటీ సభ్యులు బొత్సను అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేయడంతో వైసీపీ అధినేత జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు . విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైయస్సార్‌సీపీకి భారీ మెజార్టీ ఉన్న నేపథ్యంలో సహజంగా టీడీపీ పోటీకి పెట్టకూడదని, కాని చంద్రబాబు ఏరోజూ నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదని జగన్‌ అన్నారు. రకరకాల ప్రలోభాలు, బెదిరింపులతో అడ్డగోలుగా గెలవడానికి ప్రయత్నిస్తారన్నారు. కుయుక్తులు, కుట్రలు అనేవి చంద్రబాబు నైజం అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఉన్నిక జరగబోతోందని, అందుకే పార్టీలో అందరు నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.

- Advertisement -


ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పని చేయాలని జగన్‌ కోరారు. సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్దేశించారు. అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని, వాటిని థీటుగా ఎదుర్కొనేలా అందరూ కలిసి ముందుకు సాగాలని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందడంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా జగన్ ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. . అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత తొలిసారిగా వైసిపి, టిడిపి కూట‌మి మ‌ధ్య ఎన్నిక‌ల ఫైట్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement