కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 31తో, తెలంగాణలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 3తో పదవీ కాలం పూర్తవుతుంది. కరోనా దృష్ట్యా ఆయా స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాతే ఎన్నికలు ఉంటాయని సీఈసీ తేల్చిచెప్పింది. కాగా తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లుతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం జూన్ 3న పూర్తి కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement