Sunday, September 8, 2024

TG | ఎమ్మెల్సీ కౌంటింగ్‌ .. ఇప్పటికే 37 మంది ఎలిమినేషన్ … అధీక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటిదాకా 37 మంది ఎలిమినేట్‌ అయ్యారు.

ఎలిమినేట్ రౌండ్38 @12.30pm.
గెలుపు కోటా:1,55,095ఓట్లు.
37 మంది ఎలిమినేషన్ పూర్తి
తీన్మార్ మల్లన్న: 597(123419).
రాకేష్ రెడ్డి :428(104676).
ప్రేమేందర్ రెడ్డి :258(43571).
అశోక్ కుమార్ :165(29862).

ఉత్కంఠ రేపుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితం.

- Advertisement -
  • రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 33మంది అభ్యర్థులు ఎలిమినేషన్.
  • 33 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా షేర్ అవుతున్న ఓట్లు
  • 33 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ తర్వాత అభ్యర్థుల తుది ఓట్లు.
    తీన్మార్ మల్లన్న (కాంగ్రెస్) 123210
    రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 104514
    ప్రేమేందర్ రెడ్డి (బిజెపి) 43486
    అశోక్ గౌడ్ (స్వతంత్ర) 29776
  • బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాతే ఫలితంపై స్పష్టత వచ్చే అవకాశం.
  • మ్యాజిక్ ఫిగర్ కు కావలసింది 1,55,095 ఓట్లు.
    ఇవ్వాళ తుది ఫలితం సాయంత్రం తర్వాతే

ఇక బీజేపీకి 118, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కు 76 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపు కోటా ఓట్లను 1,55,095గా నిర్ణయించారు. దీంతో మల్లన్న గెలవాలంటే 32,282 రెండో ప్రాధాన్యతా ఓట్లు కావాల్సి ఉండగా, రాకేశ్‌ రెడ్డి గెలుపునకు 50,847 ఓట్లు రావాల్సి ఉంది. ఈసారి 25,824 ఓట్లను చెల్లనవిగా అధికారులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement