Friday, November 22, 2024

Siddipet | ఎమ్మెల్సీ బై ఎలక్షన్.. ఈ నాలుగు మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని నాలుగు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు సిద్దిపేట కమిషనర్ డా.బి.అనురాధ తెలిపారు. చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దుల్మిట్ట పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు రేపు (25-05-2024) సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు 144 సీఆర్పీసీ, పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు కమిషనర్ తెలిపారు.

నాలుగు మండలాల పరిధిలోని చేర్యాల పట్టణంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, కొమురవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకటి, మద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక పోలింగ్ కేంద్రం, దూల్మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక పోలింగ్ కేంద్రం ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ప్రతి పోలింగ్‌ కేంద్రానికి జియో ట్యాగింగ్‌ చేశారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూం నెం.8712667100, స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం 8712667306, ఎన్నికల సమయంలో ఎలాంటి చిన్న ఘటన జరిగినా డయల్ 100కు ఫోన్ చేస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement