ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికీ తప్పేనని హైకోర్టు పేర్కొంది. కేసుకు సంబంధించి 45 అంశాలను బేస్ చేసుకుని సీబీఐకి కేసు అప్పగించినట్టు జడ్జిమెంట్‌లో పేర్కొంది. కాగా, ఈ కేసు జడ్జిమెంట్ కాపీ ఇవ్వాల సీబీఐకి అందింది. దీంతో ఈ కేసును సిట్ నుంచి సీబీఐ టేకోవర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ ఎఫ్ఐర్ ప్రకారమే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక.. ఈ కేసుకు సంబంధించి పలు కీలకాంశాలను హైకోర్టు జడ్జి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కోర్టుకు గోప్యంగా అందజేయాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్ చేశారని తీర్పులో కోడ్ చేసినట్టు తెలుస్తోంది. సీఎం ప్రెస్ మీట్‌ని కూడా కోడ్ చేస్తూ తీర్పు ఆర్డర్లో పేర్కొన్నట్టు సమాచారం. దీంతోపాటు సిట్ ఎంక్వైరీపై కూడా హైకోర్టు పలు ప్రశ్నలను లేవనెత్తిందని, సిట్ ఉనికినే ప్రశ్నించినట్టు తెలుస్తోంది.