ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఓటుకు నోటు కేసు నుంచి తన పేరు తొలగించాలని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని, సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యే వరకు విచారణ చేపట్టవద్దని వేర్వురుగా రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లు దాఖలు చేశారు. ఇక పిటిషన్‌లను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం విచారించింది.
తెలంగాణ ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సెప్టెంబరు 31 వరకు సుప్రీంకోర్టు ధర్మాసనం గడువు ఇచ్చింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు సండ్రవెంకట వీరయ్యకు, రేవంత్‌రెడ్డిలకు సెప్టెంబరు 6 వరకు గడువు ఇచ్చింది ధర్మాసనం. ఇక ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 7వతేదీకి వాయిదా వేసింది. కాగా ఓటుకు నోటు కేసులో ఏ1గా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు అనంతరం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీడీపీకి రాజీనామా చేసి అధికార పార్టీ టీఆర్ఎస్ గూటికి చేరారు.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్