హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు భాజపా టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలకు దూరంగా ఉంటానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. స్వతంత్రంగా లేదా, ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్యులర్ పార్టీల్లోకి వెళ్లనని,. ప్రాణం పోయినా బిఆర్ఎస్, కాంగ్రెస్‌లో చేరబోనని తేల్చి చెప్పారు…హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భాజపా అధిష్ఠానం తనపై సానుకూలంగానే ఉందని, సరైన సమయంలో తనపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తారని చెప్పారు.. ఈసారి కూడా నాంపల్లి నుంచి బిజెపి అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని వెల్లడించారు..కాగా గోషా మహాల్ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్ధి ప్రకటించకపోవడంపై స్పందిస్తూ, ఆ సీటు ఎవరికి కేటాయించాలనేది ఎంఐఎం నిర్ణయిస్తుందని ఎద్దేవా చేశారు.. మజ్లిస్ పార్టీ సూచించిన అభ్యర్ధే ఇక్కడ కారు గుర్తుపై పోటీ చేస్తారని తెలిపారు.. .
MLA Raja Singh – నాంపల్లి బరిలో నేనే … బిజెపి సీటు ఇవ్వకుంటే రాజకీయాలకు దూరం
Advertisement
తాజా వార్తలు
Advertisement