Saturday, November 23, 2024

సింధునే బ్రాండ్ అంబాసిడ‌ర్ చేయాలి: రాజాసింగ్‌

టోక్యో ఒలింపిక్స్ లో కాస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రధాని మోదీతో పాటు అన్ని రంగాల నుంచి సింధుకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా సింధూని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలంటు సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే తన డిమాండ్ ను సీఎం కేసీఆర్ కు తెలియజేశారు. ఇక టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌’గా తప్పించాలని డిమాండ్ చేశారు. సానియా పాకిస్థాన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతోనే పాక్ వ్యక్తి అయిపోయారని.. అలాంటి సానియాను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగించడం సరికాదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.

రియో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్, ప్రస్తుతం జరుగుతున్నటోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాంధించిన సింధూ ఉండగా ఎందుకు పాకిస్థాన్ కోడలయిన సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. సింధు భారత దేశానికి మంచి పేరు తీసుకొచ్చింది, మన తెలంగాణ కు పేరు తెచ్చింది. ఇకనుంచి స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టాలని.. తెలంగాణ నుంచి మంచి మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారని తెలిపారు రాజా సింగ్.

పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది సానియా మిర్జా. సోయబ్ సానియా దంపతులకు ఓ బాబుకి జన్మనిచ్చారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ది, ప్రయోజనాలను ప్రమోట్ చేయడానికి సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ అధికార ధ్రువీకరణ పత్రంతో పాటు కోటి రూపాయల చెక్ అందించారు. సానియా అసలు సిసలైన హైదరాబాదీ కావడం తెలంగాణకు గర్వకారణమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. టెన్నిస్‌లో దేశానికి సాధించిపెట్టిన పథకాలకు గాను సానియా మీర్జాను కేంద్ర ప్రభుత్వం 2004లో అర్జున, 2006లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. క్రీడల్లో అత్యున్నతమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును కూడా ఆమెకు ప్రకటించారు.

ఇది కూడా చదవండి : జగిత్యాల జిల్లాలో మరోసారి లాక్‌డౌన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement