కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా అనే ప్రశ్న తాజాగా ఉత్పన్నం అవుతోంది. ఎందుకంటే ఆదివారం నాడు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడగా.. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్‌కు మద్దతుగా మాట్లాడటమే దీనికి కారణం.
పీసీసీ చీఫ్‌గా ఎంపీ రేవంత్ రెడ్డి ఎంపికపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించిన తీరు పార్టీలోనే కాదు ఇతర రాజకీయ పక్షాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. రెండున్నర సంవత్సరాలుగా ఇదిగో… అదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన పీసీసీ అధ్యక్ష ఎంపికపై అధిష్టానం నిర్ణయం తీసుకోగానే ఎంపీ కోమటిరెడ్డి డబ్బులు తీసుకొని పదవి ఇచ్చారని, ఇంచార్జ్ అమ్ముడుపోయారని ఆరోపించారు. తాను ఇక గాంధీభవన్ మెట్లే ఎక్కను అంటూ విమర్శలు చేశారు.