సంగారెడ్డి నియోజకవర్గంలోని బాయ్స్, గర్ల్స్, హై స్కూల్స్, కాలేజీ, హాస్టల్ భావనాల నిర్మాణం కోసం మంత్రి సబితా ఇంద్రరెడ్డిని కలిసి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థులు ఉంటారు. వీరికోసం అదనపు గదులు, భావన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో 750 మంది గర్ల్స్ చదువుకుంటున్నారు. ఐతే కాలేజీ అదనపు గదులు, భవన నిర్మాణానికి రూ.5 కోట్లు ఇవ్వాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో 346 మంది విద్యార్థినిలు చదువుకుంటారు. ఈ బిల్డింగ్ లో అదనపు గదుల, భావన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీ లో హాస్టల్ 150 వరకు విద్యార్థినిలు ఉంటారు. విరికోసం భావన నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేయాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని తార డిగ్రీ
కాలేజీ లో 3600 మంది విద్యార్థులు చదువుకుంటారు.. ఐతే అదనపు గదులు, భావన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేయాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 1050 మంది విద్యార్థినిలు చదువుకుంటారు ఐతే పాఠశాలలో అదనపు గదుల కోసం, భావన నిర్మాణానికి 3 కోట్లు మంజూరు చేయాలన్నారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కాలేజీ 500 మంది విద్యార్థులు చదువుకుంటారు ఐతే కాలేజీలో అదనపు గదుల కోసం, భావన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు చేయాలన్నారు. జగ్గారెడ్డి ప్రత్తిపాదనల పై మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సానుకూలంగా స్పందించారు.
మంత్రి సబితను కలిసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి..
Advertisement
తాజా వార్తలు
Advertisement