Monday, November 25, 2024

‘‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’’.. క్యాంపెయిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఈటల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: త్యాగాల పునాదులపైనే మానవ సమాజం ఏర్పడిందని, త్యాగం లేకపోతే వ్యర్థమని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ప్రెస్ క్లబ్‌లో ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగం చేశారని అన్నారు. ఎందరో పుడతారు, చనిపోతారు.. కానీ కొందరే గుర్తుంటారని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. త్యాగధనులను గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఈ క్రమంలో ఆగస్టు 15న మధ్యాహ్నం గం. 12.00 సమయంలో దేశ ప్రజలందరూ లేచి నిలబడి, జాతీయ గీతం ఆలపించాలని ఆయన కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను, వారి త్యాగాలను దేశ ప్రజలందరూ గుర్తుచేసుకోవడం కోసం ‘ఐ స్టాండ్ ఫర్ వారియర్స్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ‘జయహో’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు హరికృష్ణ ఇంటూరు, రిటైర్డ్ మేజర్ నమ్రత దస్మానా, విజన్ డిజిటల్ ఇండియా చైర్మన్ డా. హరికృష్ణ మారం, బీజేపీ ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రభాకర్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement