Friday, November 22, 2024

అసెంబ్లీకి ఆవుతో వచ్చిన ఎమ్మెల్యే.. లంపీస్కిన్ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాయ‌ని ఆవేద‌న‌

రాజస్థాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌సింగ్‌ రావత్‌ సోమవారం అసెంబ్లికి ఆవును తీసుకువచ్చారు. లంపీస్కిన్‌ వ్యాధితో పశువులు ఇబ్బందులు పడుతున్నాయని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇలా ఆవును అసెంబ్లిdకి తీసుకువచ్చారని రావత్‌ పేర్కొన్నారు. అయితే ఆయన అసెంబ్లి ప్రాంగణంలోకి అడుగుపెటట్టకముందే అది అక్కడి నుంచి పారిపోయింది. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతుండగా ఆవు అక్కడి నుంచి పరుగులు తీసింది. పలుపుతాడు పట్టుకున్న వ్యక్తి ఆవుని కట్టడి చేసేందుకు ప్రయత్నించినా అది ఆగకుండా పారిపోయింది.

ఈ ఘటననూ తనకు అనుకూలంగా మలుచుకున్నారు రావత్‌. ప్రశ్నించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గోవింద్‌సింగ్‌ దొతాస్రాకు బదులిస్తూ… ”ప్రభుత్వ తీరుతో ఆవులు కూడా కోపంగా ఉన్నాయి” అని కామెంట్‌ చేశారు. ఆవులు లంపీ స్కిన్‌ వ్యాధితో బాధపడుతున్నాయని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తంచేశారు. ప్రభుత్వం దృష్టిని ఈ సమస్య వైపు మరల్చేందుకే నేను ఆవుని తీసుకువచ్చానని” రావత్‌ అన్నారు. పశుసంవర్థక శాఖ లెక్కల ప్రకారం వేలాది పశువులు ఈ వ్యాధి బారినపడి మృతి చెందాయి. ఇప్పటికే 13 లక్షల పశువులకు ఈ వ్యాధి సోకింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement