Tuesday, November 26, 2024

ఎమ్మెల్యేల ఎర కేసు 18కి వాయిదా.. అప్పటివరకు సీబీఐ కేసు నమోదుకు నో చాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీలుపై విచారణ ఈనెల 18కి వాయిదా పడింది. సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ మధ్యంతర పిటిషన్లపై బుధవారం హైకోర్టులో సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు- ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, తుషార్‌, భాజపా, రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్‌ వాదనలు ముగిశాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవే వాదనలు కొంత మిగిలాయి.

అయితే ఇవాళ దవేకు జ్వరం ఉన్నందున వాదనలకు కొంత సమయం ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. అంగీకరించిన సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాం ధర్మాసనం.. రేపటి నుంచి ఈ నెల 17 వరకు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ఉన్నందున విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. 18న ఉదయం పదిన్నర గంటలకు మొదటి కేసుగా వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. హైకోర్టులో విచారణ పెండింగులో ఉన్నందున ఈ నెల 18 వరకు సీబీఐ కేసు నమోదు చేసే అవకాశం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement