కరోనా కట్టడికి వ్యాక్సిన్ వేసుకోవాలని చెపుతున్న ప్రభుత్వాలు.. మన దేశంలో విరివిరి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను అందుబాటులో ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఒక వ్యాక్సిన్ తీసుకున్న వారు మరోక వ్యాక్సిన్ తీసుకోరాదని నిబంధనలు ఉండేవి…కాని ఇప్పుడు కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై అధ్యయనానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో తమిళనాడులోని వెల్లూర్ మెడికల్ కాలేజీ ట్రయల్స్ నిర్వహించనుంది. జులై-29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కి చెందిన నిపుణుల కమిటీ ఈ అధ్యయానికి సిఫారసు చేసింది. కరోనా వ్యాక్సిన్లు అయిన.. కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్సింగ్ కోసం 300 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై… ఫేజ్-4 క్లినికల్ ట్రయల్ నిర్వహించేందుకు వెల్లూర్ మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో గులాబీ దండు.. హరీష్ బైక్ ర్యాలీ