బిజెపితో 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి . 38 మందిలో 21 మంది తనతో మాట్లాడుతున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలతో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి నెలకొంది. బెంగాల్లో ఈడీ అధికారుల తనిఖీల వ్యవహారం, మాజీ మంత్రి పార్థ చటర్జీ అరెస్ట్ ఘటనలు కాకరేపుతున్నాయి. పాఠశాల ఉద్యోగాల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై బెంగాల్ పరిశ్రమల మంత్రి పార్థ ఛటర్జీని శనివారం అరెస్టు చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అక్రమ నియామకాల్లో ఆయన పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది.ఈ తరుణంలో పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో సుమారు రూ. 20 కోట్ల నగదు ఈడీకి దొరికింది. ఈ కుంభకోణం కేసులో మంత్రిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ విషయంలో మంత్రికి, అర్పితా ముఖర్జీతో సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆమె ఇంట్లో దొరికిన నగదు నేరపు ఆదాయం అని చెబుతోంది. ఈ సమయంలో మంత్రి ఛటర్జీ.. మమతా బెనర్జీకి ఫోన్ చేశారట. ఆమె ఫోన్ లిప్ట్ చేయలేదని సమాచారం.
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు-బిజెపితో టచ్ లో వున్న 38మంది టీఎంసీ ఎమ్మెల్యేలు
Advertisement
తాజా వార్తలు
Advertisement