Thursday, November 14, 2024

మిథాలీరాజ్‌ రిటైర్‌మెంట్‌.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు

లెజెండరీ భారతీయ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ రిటైరయ్యారు. అన్నిరకాల అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్వస్తి పలుకుతున్నట్టు బుధవారం ప్రకటించారు. ట్విటర్‌ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తనకు అండదండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా అంతర్జాతీయ క్రికెట్‌కు ఇప్పటిదాకా భారత్‌ తరఫున మిథాలీ ప్రాతినిథ్యం వహించారు. మొత్తం 232 మ్యాచ్‌లు ఆడారు. సగటున 50.68 చొప్పున తన కెరీర్‌లో 7,805రన్‌లు చేశారు. టీ 20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లకు గతంలోనే స్వస్తి పలికారు. 1999లో ఆమె అంతర్జాతీయ టోర్నీలోకి అడుగుపెట్టారు. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడ్డారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లోఎ భారత్‌ సెమీఫైనల్స్‌కంటే ముందే చతికిలపడింది. అయితే 2017లో జరిగిన ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో మాత్రం రాణించారు.

మిథాలీ నాయకత్వంలో భారత జట్టు ఫైన ల్స్‌కు చేరుకుంది. స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ గెలుచుకుంది. 2005లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు ఓటమిని మూటకట్టుకుంది. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌లలో ఈ స్టయిలిష్‌ బ్యాటర్‌…. 2,364 ప రుగులు తీసింది. ఇప్పటికీ ఆ రి కార్డును ఎవరూ అధిగమించలేదు. 12 టెస్ట్‌ మ్యాచ్‌లలో మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. 699 పరుగులు తీసింది. రెండు దశాబ్దాలకుపైన తన కెరీర్‌లో అంతర్జాతీయంగా ఎనిమిది సెంచరీలు చేసింది. మరో 85 అర్థ శతకాలను తన సొంతం చేసుకుంది. 2002లో ఇంగ్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో 214 ఇన్నింగ్స్‌ చేసింది. మహిళా టెస్ట్‌్‌ క్రికెట్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన రెండో స్థానంలో నిలిచింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement