ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో అవకతవకల కేసు విచారణపై కర్ణాటక హైకోర్టు స్టే ఇచ్చింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాతోపాటు మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎన్నికల బాండ్ల పేరిట రూ.కోట్లు దోచుకున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై బెంగళూరులో కేసు నమోదైంది.
పారిశ్రామికవేత్తలను బెదిరించి ఎన్నికల బాండ్ల పేరిట రూ.8,000 కోట్లకుపైగా లూటీ చేశారని జనాధికార సంఘర్ష సంఘటన (జేఎస్‌పీ) నేత ఆదర్శ ఆర్.అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ లో తమపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎం.నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 22కి వాయిదా వేసి.. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.