Friday, November 22, 2024

Mission Sun – ఆదిత్య ఎల్ 1 ప్ర‌యోగానికి ముహుర్తం పిక్స్….

బెంగుళూరు – చంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత జోష్‌లో ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ప్రయోగం చేపట్టనుంది. తాజాగా ఆదిత్య ఎల్‌-1 ప్రయోగానికి సంబంధించిన తేదీని కూడా ఇస్రో ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టనున్నట్టుగా తెలిపింది. ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నింగిలోకి మోసుకువెళ్లనున్నట్టుగా తెలిపింది. ఇక, ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ (షార్) కు తీసుకువచ్చారు.

ఇదిలాఉంటే, శ్రీహరికోటలోని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ఈ ప్రయోగం లాంచ్‌ను వీక్షించాలనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కూడా ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్‌ను భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్‌ పాయింట్‌-1 వద్ద కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా సౌర వ్యవస్థపై పరిశోధనలు జరపడంతో పాటు.. సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయాలిన ఇస్రో చూస్తుంది. ఇందు కోసం ఏడు పేలోడ్స్‌ను తీసుకెళ్తుండగా.. ఇవి ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనంలో చేయడంలో ఉపయోగపడనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement