Friday, November 22, 2024

Mission Aitya – ఆదిత్య మిష‌న్ సూప‌ర్ స‌క్సెస్ – సూర్యుని వైపు దూసుకెళుతున్న ఉప‌గ్ర‌హం

శ్రీహ‌రికోట – సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సి57 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఆదిత్య-ఎల్1 ఉపగ్రహం లాంచింగ్ విజయవంతం అయినట్టుగా ఇస్రో ప్రకటించింది.
ఇక్కడ నుంచి దాదాపుగా 15 లక్షల దూరంలో ఉన్న లాంగ్రెస్ పాయింట్ 1(L1) వద్దకు చేరుకుని అక్కడి హాలో కక్ష్యలో ఆదిత్య ఎల్1 శాటిలైట్ చేరనుంది. ఇక్కడ నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. ఐదేళ్ల పాటు ఈ పరిశోధనలను కొనసాగించనుంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ డేటాను అందించనుంది. రోజుకు 1400 ఫోటోలను భూమికి పంపనుంది.

పిఎస్ఎల్వీ నుంచి ఉపగ్ర‌హం వేరై నిర్ణీత క‌క్ష‌లోకి ప్రేవేశించ‌డంతో షార్‌లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆదిత్య ఎల్1 లాంచింగ్ విజయవంతమైందని తెలిపారు. ఆదిత్య ఎల్1 కోసం పనిచేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు చెప్పారు. ఆదిత్య ఎల్ 1 దాదాపు 125 రోజులు సుదీర్ఘంగా ప్రయాణించి.. ఎల్ 1 పాయింట్‌ను చేరుకుంటుందని.. ఆదిత్య ఎల్‌1కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని అన్నారు. ఇక, కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అలాగే ప్ర‌ధాని మోడీ కూడా ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదిత్య మిషన్ విజయవంతం కావడం పట్ల హార్షం వ్యక్తం చేస్తూ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement