నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ కు చెందిన విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ అయిందివ. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సిగ్నల్ కనెక్షన్ కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు అధికారులు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు.
విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..