తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు పడవ ప్రమాదం తప్పింది. పడవ ప్రమాదం నుండి సురక్షితంగా మంత్రి బయటపడ్డారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో మంత్రి గంగుల పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ నాటుపడవ ఎక్కి చెరువులో వెళుతుండగా ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడటంతో ఆయన నీటిలో పడిపోయారు. అయితే ఆయన పడినచోట చెరువు లోతు తక్కువగా వుండటంతో ప్రమాదం తప్పింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement