Tuesday, November 26, 2024

ఒడెస్సాలో తప్పిన భారీ ముప్పు..

ఉక్రెయిన్‌లోని మరో పోర్టుసిటీలో పెనుముప్పు తప్పింది. ఈ నగరంపై పట్టుకోసం రష్యా నానా యాతనలు పడుతోంది. తాజాగా సోమవారంనాడు ప్రయోగించిన క్షిపణులు ఒక రసాయనిక కర్మాగారాన్ని తాకడంతో పెనువిధసం జరిగింది. క్షిపణుల ధాటికి 40 అడుగుల విస్తీర్ణం, 10 అడుగుల లోతున బిలం ఏర్పడింది. అయితే ఈ క్షిపణులు గానీ పొరబాటున రసాయన కర్మాగారానికి కొద్ది అడుగుల దూరంలోని ఎరువుల ఫ్యాక్టరీని తాకి ఉంటే ఐరోపాలో అతిపెద్ద విషాదకర దుర్ఘటన జరిగేది. ఆ ఫ్యాక్టరీలో 1.2 లక్షల టన్నుల విషపూరిత ద్రావకాలు నిల ఉన్నాయి.

వాటిపై క్షిపణులు పడి ఉంటే భారీ అగ్నిప్రమాదం సంభవించి దట్టమైన విషమేఘాలు అలుముకుని లక్షల్లో మరణాలు సంభవించి ఉండేవి. ఆ ఫ్యాక్టరీలోని అమ్మోనియా నిలలు పేలి ఉంటే నగరం భస్మీపటలమైపోయేదని ఉక్రెయిన్‌ రక్షణ బలగాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ నేరాన్ని రష్యా తమపైకి నెట్టేసేదని వారు ఆరోపించారు. పోర్ట్‌ సిటీ మరియపోల్‌ను సాధీనం చేసుకున్న రష్యా మరో పోర్ట్‌ సిటీ ఒడెస్సాను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement