సివిల్స్ సాథించడం అంత ఈజీ కాదు..సివిల్స్ సాధించని వారు మానసికంగా కృంగిపోతుంటారు. పంజాబ్‌కు చెందిన ఓ సివిల్ యాస్పిరెంట్ మాత్రం డేరింగ్‌గా తన సివిల్స్ సమరాన్ని, అందులో వైఫల్యాన్ని ట్విట్టర్‌లో తెలపడం విశేషం. జమ్ము కశ్మీర్‌కు చెందిన రజత్ సంబ్యాల్ అక్కడే పుట్టి పెరిగాడు. చండీగడ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పదేళ్లుగా సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు. తాజాగా కూడా ఈ సివిల్స్‌కు ప్రయత్నించి విఫలం అయ్యాడు.రజత్ సంబ్యాల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్ ని పెట్టాడు. తన పదేళ్ల హార్డ్ వర్క్ బూడిదలో కలిసిందన్నాడు. యూపీఎస్‌సీ కోసం ఆరు సార్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయని వివరించాడు. అందులో మూడు సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొన్నాడు. రెండు సార్లు మెయిన్స్ ఫెయిల్ అయినట్టు వివరించాడు. ఇక తన చివరి అటెంప్ట్ కూడా ఫెయిల్ అయిందట. ఇంటర్వ్యూలో తక్కువ స్కోర్‌తోనూ తన చివరి ప్రయత్తం కూడా వృథా అయిందని… 11 మార్కుల దూరంలో తన సివిల్స్ కల చెదిరిపోయిందని వివరించాడు. అయితే ఏం.. తాను మళ్లీ పైకి ఎగురుతా అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ట్వీట్‌ను ముగించాడు. తన మార్కుల టేబుల్‌ను, యూపీఎస్సీ ఆఫీసు ముందు దిగిన తన ఫొటోనూ ఈ ట్వీట్‌కు రజత్ సంబ్యాల్ జోడించాడు. రజత్ సంబ్యాల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఆయన ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆయనను ఎంకరేజ్ చేశారు. విధిని సవాల్ చేయలేమని, స్ట్రక్చరల్ ఇంజినీర్‌గా రజత్ సరిపోతాడని ఓ యూజర్ పేర్కొన్నాడు. కాగా, సివిల్స్ సాధించలేవేమో గానీ… ఈ క్రమంలో పోగుచేసుకున్న మేధా సంపత్తి ఎప్పుడూ వృథా కాదని, అది ఎల్లప్పుడూ వెంటే ఉంటుందని మరో యూజర్ తెలిపాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement