అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కారును మరో కారు ఢీకొట్టింది. డెలావేర్‌లోని తన క్యాంపెయిన్ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అధ్యక్షుడు భద్రత నిమిత్తం కార్యాలయానికి సమీపంలో నిలిపి ఉంచిన ఓ కారును మరో కారు ఢీకొట్టింది. బైడెన్ తిరుగుప్రయాణమయ్యేందుకు కార్యాలయం నుంచి బయటకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన భద్రతా అధికారులు అధ్యక్షుడిని వడివడిగా అక్కడి నుంచి తరలించారు. బైడెన్, ఆయన భార్య సురక్షితంగా ఉన్నట్టు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.