చావు ఎవరి కోసం ఆగదు.. కాని ఈమె అంటే చావుకే బయం.. ఒకటి కాదు.. రెండు కాదు ఎకంగా మూడు సార్లు 20వ శతాబ్దానికి చెందిన అత్యంత ప్రమాద కరమైన ఓడ ప్రమాదాల్లో చావు అంచుల వరకు వెల్లి వచ్చింది ఈమె. ఆమె పేరు వైలెట్ జెస్సొప్ అర్జెంటీనాలో 1887లో జన్మించింది.. చిన్న తనంలో కూడా అప్పటి ప్రమాద కరమైర రోగాల్లో ఒకటైన ప్లేగు జబ్బును ఎదుర్కొంది. అలిగే, తను షిప్పుల్లో నర్సుగా పని చేస్తుండేది..
ఆమె 1911లో బ్రిటీష్ యుద్ధనౌక HMS హాక్‌తో ఢీకొని మునిగి పొయిన RMS ఒలింపిక్‌లో ఉంది. 1912లో టైటానిక్ ఉత్తర అట్లాంటిక్లో ఓ మంచుకొండని ఢీ కొని మునిగి పోయిన నౌకలో నుంచి ప్రాణాలతో బయట పడగలిగింది. అలాడే 1916లో బ్రిటానిక్ నౌక ఏజియన్ సముద్రంలో మునిగిపోయింది అందులోంచి కూడా ఆమె బయట పడి ప్రాణాలను దక్కించుకుంది. ప్రమాదంలోచి బయట పడుతున్న సమయంలో తన తలకు గాయం అయినట్టు జెస్సోప్ తెలిపింది.. అలా వైలెల్ జెస్సోప్ మూడు నౌక ప్రమాదాల నుంచి బయట పడి తన ప్రాణాలను దక్కించుకుంది.. జెస్సోప్ ను మిస్ అన్‌సింకబుల్, మునిగే నౌకల రాణి అని పిలుస్తారు.1971లో 83 ఏళ్ల వయసులో గుండె పోటుతో మరణించారు వైలెట్ జెస్సోప్..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital